
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఊరంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించ వచ్చని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పిలుపునిచ్చారు. ఏ ప్రాంతమైనా ఏ గ్రామమైనా సమిష్టి కృషి తో ముందుకు వెళ్తే అబివృద్ది సాధ్య మని సూచించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంత ప్రజల మన్ననలు అందుకున్నప్పుడే ఆ పదవికి సార్థకత ఉంటుందని అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని 15 వ డివిజన్ అర్సపల్లిలో మాజీ కార్పొరేటర్ లావణ్య నవీన్ దంపతులకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి గడుగు గంగాధర్ తో పాటు సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్, ప్రీతం మాజీ కార్పొరేటర్లు నర్సుబాయి, రఘువీర్, బాల్ కిషన్ గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
లావణ్య దంపతులను ఘనంగా సన్మానించారు జ్ఞాపికను అందజేశారుపూర్తిగా గ్రామీణ వాతావరణం కలిగిన అర్సపల్లిలో గత ఐదేళ్లుగా అనేక అభివృద్ధి పనులు జరిగాయని గడుగు గంగాధర్ గుర్తు చేశారు. కోట్లాడి నిధులు తెచ్చినపుడే ప్రజలు తమను గుర్తిస్తారని ఎన్నికల్లో ఆదరిస్తారని చెప్పారు.డివిజన్ లో సుమారు 20 కోట్ల పనులు జరగడం విశేషమని కొనియాడారు. అభివృద్ధిని గుర్తించి గ్రామస్తులు సన్మాన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని గంగాధర్ అన్నారు.రైతు సమస్యలు తన దృష్టికి తెస్తే కమిషన్ ద్వారా ప్రభుత్వంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సిర్ప లింగం, సవిత బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. గ్రామ కమిటీ ప్రతినిధులు సిర్ప నాగయ్య,గౌరారం సాయిలు, గంగాధర్, రాజన్న,అబ్బయ్య, సిర్ప కిరణ్ లు పాల్గొన్నారు.