రెండవ రోజు కొనసాగిన అంగన్వాడీ, ఆయాల నిరసన

నవతెలంగాణ – కంఠేశ్వర్
అంగన్వాడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచాలని పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు ధర్నా చౌక్ లో అంగన్వాడి ఆయాలు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి స్వర్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మూలంగా అంగన్వాడి ఆయాలు టీచర్లు లో 65 సంవత్సరాల నిండిన వారిని విధుల నుంచి నీ ఆదేశించడంతో దశాబ్దాలుగా పనిచేసిన తమకు ప్రభుత్వం ఆదుకోకుండా వదిలివేట మూలంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గత సెప్టెంబర్ లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు చెల్లించాలని పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల నుండి ఆయ సరస్వతి మాట్లాడుతూ..  అంగన్వాడీ కేంద్రాలలో అనేక మంది చిన్న పిల్లలకు సేవలు చేసి విద్యార్థులు నేర్పిన తమకు ప్రభుత్వం నిరాదరణకు గురి చేయటం సరికాదన్నారు. తమ చివరి దశలో ఏ రకమైన ఆధారం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు భారంగా మారే పరిస్థితి వచ్చిందని వారు కూడా ఆదరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తమకు సౌకర్యం కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరొక రిటైర్డ్ ఆయ కళావతి మాట్లాడుతూ.. పేదల పిల్లలకు దశాబ్దాలుగా అన్ని రకాల సేవలు చేసిన తమకు తమ కుటుంబాన్ని కూడా విస్మరించామని చివరి దశలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో తమ బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తోపాటు అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.