
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ :
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటుతో బుద్ధి చెప్పాలని శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతులను పట్టించుకోని నాయకులు తెలంగాణలో రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోటి తిప్పలు పడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, అక్కన్నపేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు, చిట్టి గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బోజ్జ హరీష్, కొంకటి రవి, సర్పంచులు బత్తుల మల్లయ్య, పోలవేణి లతా సంపత్, దుండ్ర భారతి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.