– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్
నవతెలంగాణ-సూర్యాపేట
కార్మిక వ్యతిరేక పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవన్ లో జరిగిన సిఐటియు జిల్లా నిర్మాణం వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 2014 అధికారంలోకి వచ్చిన బిజెపి కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోల్ తెచ్చి కార్పొరేట్ అనుకూలమైన విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు.మోడీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతోనీ అధికారం లోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల ను కార్పోరేట్ దిగ్గజాలకు కారు చౌకగా అమ్మివేసి దేశాన్ని దివాలా తీయించిందన్నారు. రాష్ట్రం లో ఉద్యమ పార్టీగా అధికారం లోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రం లో 73 పరిశ్రమల వేతన సవరణ బిల్లు అమలు కొరకు జీవో విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ కార్మికుల పొట్టలు కొడుతున్నారని ఆయన అన్నారు.రాష్ట్రం లో అశా, అంగని వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు, గ్రామ పంచాయితీ కార్మికులు, ఆవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టీ చేయించుకుంటూ వేతనాలు పెంచాలనే సోయి లేక పోవడం అన్యాయం అని ఆయన వాపోయారు. దళిత బందు, గహ లక్ష్మీ, పథకాలు ఎన్నికల ముందు హడావుడి చేసి చివరికి ఎన్నికల కమీషన్ మీద నెట్టి చేతులు దులుప్నుంటున్నారన్నారు. రానున్న తెలంగాణ రాష్ట్ర అసంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతీ పార్టీ కార్మిక మేనిఫెస్టో విడుదల చేయాలని ఆయన కోరారు. తెలంగాణ లోని కార్మిక వ్యతరేక రాజకీయ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, కోశాధికారి వెంకట్ నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీలం శ్రీను, సోమపంగు రాధాకష్ణ,సహాయ కార్యదర్శులు చెరుకు ఏకలక్ష్మి, యల్క సోమయ్య గౌడ్,జిల్లా కమిటీ సభ్యులు ఎం. ముత్యాలు,సాయికుమార్, రణ్మియ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.