
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్
– ఎస్ కే యం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ – జమ్మికుంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. శుక్రవారం సయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) కార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో కూరపాటి రమేష్ పాల్గొని మాట్లాడారు. రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతము కలిపి మద్దతు ధరల గ్యారంటీ చేసే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. 60 ఏళ్ల పైబడిన అందరికీ పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. పెన్షన్ రూ.10,000 రూపాయలు అందరికీ చెల్లించాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజులను 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని అనుకోరారు. పెండింగ్ లో ఉన్న అన్నివేతాలు చెల్లించాలని, జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే, రక్షణ ,విద్యుత్తు సహా ప్రభుత్వ రంగ సంస్థలను పబ్లిక్ సర్వీస్ లను ప్రైవేటీకరణ చేయరాదన్నారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ఆహారవస్తులు నిత్యవసర వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించాలన్నారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ లపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ( పిడిఎస్) విస్తరించాలని, 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని, ఆహార భద్రత చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిని ఆపాలని, ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ,మహిళలపై దాడులను అరికట్టి ,సామాజిక న్యాయం అమలు చేయాలని, అందరికీ నాణ్యమైన ఆరోగ్యం ,విద్యను అందించాలన్నారు. జాతీయ విద్యా విధానం ఎన్ఇపి 20 22ను రద్దు రద్దు చేయాలన్నారు. అందరికీ గృహ వసతి కల్పించాలని, ప్రభుత్వ స్థలాలు గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని , ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్ పూరి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, దండిగారి సతీష్, రాజకుమారి, ముద్దమల్ల కుమార్, రావుల ఓదెలు, వడ్లూరి కిషోర్ సిఐటియు, రైతు సంఘం, హమాలి సంఘం, వ్యవసాయ కార్మిక, భవన నిర్మాణ కార్మిక సంఘాల, నాయకులు పాల్గొన్నారు.