నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
హుజూర్‌నగర్ పట్టణపరిధిలోని రామస్వామి గట్టువద్ద ఉన్న ఇండ్లు పేదలకు ఇస్తామని ఈనెల 4 లోపుదరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటన విడుదల చేయడం సరికాదని, ఇంకా గడువు తేదీ పెంచాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఒకట్రెండు తేదీలు సెలవులు రావడం ఒక్కరోజులో దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని,వెంటనే దరఖాస్తు తేదీ పెంచాలని కోరారు.రామస్వామి గట్టు వద్ద 2700 ఇళ్ల నిర్మాణం జరిగిందని, అవి అసంపూర్తిగా ఉన్నాయ న్నారు.ప్రస్తుతం కేవలం 1000 ఇళ్లు మాత్రమే పంచుతా మంటున్నారని పేర్కొన్నారు. పట్టణంలో 4000 మందికి పైగా ఇళ్లు, స్థలాలు లేని పేదలు ఉన్నారని తెలిపారు.ప్రభుత్వం గహలక్ష్మీ కింద ఇస్తానన్న ఇళ్ల దరఖాస్తుల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు పేద ప్రజలు చేసుకున్న దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్‌లో ఫీడ్ చేసి ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవానడంలో ఆంతర్యం ఏంటని ఫ్రశ్నించారు.సెప్టెంబర్ 30న తహసీల్దార్ ప్రకటన విడుదల చేసి ఈనెల 4వ తేదీ చివరి తేదీ అనడం సరికాదన్నారు.10వ తేదీ వరకు గడువు పెంచాలని కోరారు.ఈసమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం,వట్టెపు సైదులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల మురళి,నర్సింగ్ లింగమ్మ,గొర్రెలుమేకల పెంపకందారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం వెంకటనారాయణ,శాఖ కార్యదర్శి రేపాకుల