– పొగాకు వాణిజ్య ప్రకటనల నిషేధంపై మాచన రఘునందన్ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించి వాణిజ్య ప్రకటనలను రాష్ట్రంలో నిషేధిస్తూ చట్టం చేయడం పట్ల పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని ధన్యవాదాలు తెలిపారు. హుక్కాపై కూడా నిషేదం విధిస్తూ బిల్లును ఆమోదించడం. శుభపరిణామని అభివర్ణించారు. ఈ చర్య దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రజల ఆరోగ్య గురించి ఆలోచింపజేసేదిగా ఉందని తెలిపారు.