
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మండల్ కమిషన్ అమలు ఆమోదం జరిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే మండల కమిషన్ ఆమోదాన్ని అమలు చేయాలని నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా లో మండల్ కమిషన్ అమలుకు ఆమోదం తెలిపిన రోజు గా పాటిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులకు1990లో ఆనాటి వి పి సింగ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అయినప్పటికీ 1993నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ లకు రిజర్వేషన్ 27శాతం, 2009నుండి కేంద్ర విద్యాసంస్థ లలో అమలు అయిందన్నారు. మండల్ కమిషన్ సూచించిన 38 సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థ లలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వడ్డేపల్లి మల్లేశం, టీపీసీసీ ప్రతినిధి కేడం లింగమూర్తి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిత్తారి రవీందర్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ హసన్, గొర్ల ఐలేష్ యాదవ్, గుత్తి కొండ వేణు తదితరులు పాల్గొన్నారు.