నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ.ఎం సంతోష్ విజ్ఞప్తి చే శారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని కలను పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్ కోసం పగడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి సహకరించాలని కోరారు.జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం గద్వాల అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. 79-గద్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాలకు పీి.ఓ లు 303, ఎ.పీ.ఓ లు 303, ఓ.పీి.ఓ లు 606 మొత్తం 1212 మంది ఎన్నికల సిబ్బందితో పాటు అదనంగా 244 మందిని కేటా యించి నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రా లలో 44 మంది మైక్రో అబ్సేర్వేర్లను నియమించడం జరిగిందని, గద్వాల్ లో 34 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో రూట్‌కు ఒక్కో సెక్టార్ అధికారిని నియమించడం జరిగిందని అ న్నారు. వారికి ప్రత్యేక వాహనాలను, పోలింగ్ సిబ్బం దిని తరలిం చుటకు 34 బస్సులను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. 80- అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 291 పోలింగ్ కేంద్రా లకు పీ.ఓ లు 291 , ఎ.పీి .ఓ ల 291, ఓ.పీ.ఓ లు 582 , రిజర్వు 236 మందిని కేటాయించడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో 54 మంది మైక్రో అబ్సేర్వేర్లను నియమించడం జరిగిందని అన్నారు. గద్వాల్ లో 31 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో రూట్ కు ఒక్కో సెక్టార్ అధికారిని నియమించడం జరిగిందని అన్నారు. వారికి ప్రత్యేక వాహనాలను , పోలింగ్ సిబ్బందిని తరలించుటకు 31 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సాయంత్రం ఆరు గంటల వరకు వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరుగు తుందని తెలిపారు. కూలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద భోజన సదుపాయం, తాగునీరు, మరుగుదొడ్లు ఇతర సదుపా యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల దష్ట్యా పోలింగ్ సిబ్బందికి అవసరమైన టెంట్లు, కూలర్లతో పాటు మెడికల్ కిట్లు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు తదితర వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రశాంత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని, జిల్లాలోని ప్రతి ఓటర్ స్వేచ్ఛగా తమఓటు హక్కును వినుయో గించుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని గద్వాల్, అల్లంపూర్ నియోజకవర్గాల వారీగా వివరాలు…
గద్వాల నియోజకవర్గంలో పురుషులు 1,25,639 మంది, మహిళలు 1,30,978 మంది, ఇతరులు 11 మొత్తం 2,56,628 మంది ఓటర్లు . అలంపూర్ నియోజ కవర్గంలో పురుషులు 1,17,997 మంది, మహిళలు 1,21,074 మంది, ఇతరులు 08, మొత్తం 2,39,079 మంది ఓటర్లు. గద్వాల , అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి 767 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 767 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 1536 ఓ పీి ఓ లు, 138 మైక్రో అబ్జర్వర్స్ కు ఎన్నికల విధులు కేటాయించారు. బ్యాలెట్ యూనిట్లు 378 , కంట్రోల్ యూనిట్లు 378 , వీవీ ప్యాట్ లు 424 కేటాయించగా ఆలంపూర్ నియోజక వర్గానికి బ్యాలెట్ యూనిట్లు 363, కంట్రోల్ యూనిట్లు 363, వివిప్యాట్ లు 407 లను కేటాయించారు. గద్వాల్ , అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 594 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గద్వాల్ నుండి 1456, అలంపూర్ 1400 పోలింగ్ సిబ్బందినీ నియమించారు.