కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి..

నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే శ్రీనివాస్, పల్లె నర్సింహులు విజ్ఞప్తి చేశారు. శనివారం తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర హైదరాబాదులో ప్రారంభమై భువనగిరికి చేరుకుంది. బస్సు యాత్రకు జిల్లా ప్రజా నాట్య మండలి కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. భువనగిరిలోని బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే శ్రీనివాస్ పల్లి నరసింహులు మాట్లాడారు. అంతరించిపోతున్న కళలను కళాకారులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. యాదాద్రి దేవస్థానంలో  ప్రజానాట్య మండలి కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్ ఉపాధ్యక్షులు ఇంజ హేమలత సిపి ఐ పట్టణ కార్యదర్శి పుట్టా రమేష్ సహాయ కార్యదర్శి చింతల మల్లేష్ భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య పట్టణ నాయకులు చింతల పెంటయ్య చొప్పరి సత్తయ్య విద్యార్థి నాయకులు జానీ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అన్యమైన వెంకటేశం వడ్లకొండ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.