నిజామాబాద్ న్యాయవాది ఖాసిం గారిపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటన పైన చర్చించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ.. నిజాంబాద్ నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుంది అని , గుడగిరి రాజ్యం ఎలుతుంది అని దీనిని అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఖాసిం పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు.ఆందోళనకు స్పందించిన అడిషనల్ డిసిపి బసవరెడ్డి జిల్లా కోర్టు వద్ద వచ్చి న్యాయవాదులతో మాట్లాడి దాడి కేసులో హత్య యత్నం సెక్షన్ ఆల్టరేషన్ చేసే కోర్టులో మేమో దాఖలు చేశామని అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేశామని కచ్చితంగా అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, వసంతరావు, రాజు, సురేష్, పిల్లి శ్రీకాంత్, అయూబ్ ,పరుచూరి శ్రీధర్, భాస్కర్, పి వెంకటేష్,మాణిక్ ఆశ నారాయణ రాజు, రవీందర్, విగ్నేష్ ,జైపాల్, ఆశ నారాయణ, జునేద్ ,ఇర్ఫాన్, జిషంత్, ఇంతియాజ్,ఖలీద్, కవిత రెడ్డి ,అంజలి,కావ్య,అఖిల, ప్రవీణ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.