– సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండే శ్రీనివాస్
నవతెలంగాణ-గోదావరిఖని:
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సింగరేణికి ఆర్థిక ప్రగతిపై చర్చించి, కార్మికు లకు లాభాల వాటాను ప్రకటించాలని సీఐటీ యూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లా యీస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం గడిచి మూడు నెలలు దాటిన ఇంకా సంస్థకు లాభాలు ఎన్ని వచ్చాయనేది ఇప్పటివరకు ప్రకటించలేదని, గత ఎంపీ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ ముగిశాక లాభాలు ప్రకటిస్తామని చెప్పడం జరిగిందని, అయినప్పటికీ ఇప్పటికీ లాభాలు ప్రకటిం చలేదని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 100శాతం సాధించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల వాటాను ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో లాభాల ప్రకటన తొందరగా జరుగుతుందని, ఉద్యోగస్తుల వాట సైతం స్కూలు పిల్లల చదివింపులకు ఇబ్బందులు సమ యానికి అందుతాయని ఆశలు పడ్డ కార్మికులకు అడియాసలే మిగిలాయని అన్నారు. గతంలోనూ సింగరేణి లాభాలను అసెంబ్లీలో ప్రకటించిన సందర్భాలు ఉన్నందున ఈసారి సమావేశాలు ఇంకో వారం రోజులు జరిగే అవకాశం ఉన్నందున చర్చ జరపాలని, తమ సమస్యలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎంత మేర పరిష్కరిస్తారని రాజకీయ జోక్యాన్ని ఎంత మేరకు తగ్గిస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్న అంతేకాకుండా బొగ్గు గనుల వేలం పాట పైన చర్చ జరిపి కార్మికులకు తాము సింగరేణి సంస్థకు అండగా ఉంటామని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటాను కొది ్దకొద్దిగా పెంచుకుంటూ 32 శాతం లాభాలను గత సంవత్సరం వరకు చెల్లించారని, ఈసారి సింగరేణి నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘాలుగా గెలిచిన సీపీఐ అనుబంధంగా ఏఐటీయూసీి, కాంగ్రెస్ అనుబ ంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ ప్రాతినిథ్య సంఘంగా కొనసా గుతునందున్న టీబీజీకేస్ గుర్తింపు సంఘంగా కొనసాగినన్ని రోజులు 35శాతం వాటాకై డిమాండ్ చేసి నేడు అధికా రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కొనసాగు తున్నందున 35శాతం వాటా చెల్లిస్తారని కార్మికులు ఆశతో ఎదురుచూ స్తున్నారని అన్నారు.