త్వరలో నేతన్న భరోసా

The assurance of a leader soon– వారి దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యం ప్రభుత్వ ఆర్డర్లన్నీ టెస్కో ద్వారానే…
– బతుకమ్మ చీరలకు నిధులివ్వని బీఆర్‌ఎస్‌ సర్కార్‌
— 30 శాతం బోగస్‌ సొసైటీలకే బిల్లులు చెల్లింపు
– గత నవంబర్‌ నాటికే రూ.488 కోట్ల బకాయిలు
– ప్రాథమిక విచారణలో గత ప్రభుత్వ నిర్వాకాలు వెలుగులోకి..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నేత కార్మికుల స్వయం సమృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘నేతన్న భరోసా’ అనే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నది. చేనేత, మరమగ్గాల కార్మికులకు దీర్ఘకాలిక లభ్ది చేకూరేలా కొత్త పథకం ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్లూమ్‌ పార్క్‌ పునరుద్ధరణ, కొత్త పవర్‌ లూమ్‌ క్లస్టర్ల అభివృద్ధి, మైక్రో హ్యాండ్లూమ్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజైన్స్‌ ఏర్పాటు, స్టేట్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ పాలసీ తీసుకురావాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలను ఈ కొత్త విధానానికి అనుసంధానం చేస్తూ, పాత బకాయిలు కూడా వసూలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో బతుకమ్మ చీరల పథకాన్ని వ్యాపారంగా మార్చిందనే అభిప్రాయం ఉంది. ఈ వ్యాపారంలో 2023 నవంబర్‌ నాటికే దాదాపు రూ.488.38 కోట్లు బకాయిలను టెస్కోకు చెల్లించాల్సి ఉంది. వీటిలో గత ఏడాది అక్టోబర్‌లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 351.52 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్‌ యూనిఫామ్స్‌ సరఫరా కోసం దాదాపు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు అవసరమైన నిధులు విడుదల చేసింది. మాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు, సైజింగ్‌ యూనిట్లకు అడ్వాన్సులు చెల్లించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేనేత సహకార సంఘాలను విస్మరించి మాక్స్‌ సహకార సంఘాలను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. దీనివల్ల అసలైన కార్మికులకు లభ్ధి చేకూరలేదనీ,. వ్యాపారులు, దళారుల జోక్యం మితిమీరిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాలు ఉంటే, కేవలం 105 చేనేత సహకార సంఘాలకు మాత్రమే పని కల్పించినట్టు ప్రస్తుత ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ఇందుకు భిన్నంగా అన్ని చేనేత సంఘాలకు పనికల్పించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి, గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను కూడా విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని పేర్కొంటూ మార్చి 11వ తేదీ జీవో నెం.1 ని విస్మరించి మాక్స్‌ సహకార సంఘాలను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. దీనివల్ల అసలైన కార్మికులకు లభ్ధి చేకూరలేదనీ,. వ్యాపారులు, దళారుల జోక్యం మితిమీరిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాలు ఉంటే, కేవలం 105 చేనేత సహకార సంఘాలకు మాత్రమే పని కల్పించినట్టు ప్రస్తుత ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ఇందుకు భిన్నంగా అన్ని చేనేత సంఘాలకు పనికల్పించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి, గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను కూడా విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని పేర్కొంటూ మార్చి 11వ తేదీ జీవో నెం.1 ని ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసింది. దీనివల్ల టెస్కోలో లభ్యం కాని వస్త్రాలకు నాన్‌ ఎవైలబిలిటీ సర్టిఫికెట్‌ ఇస్తే తప్ప, ప్రయివేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు వస్త్రాల సరఫరా కోసం టెస్కోకు రూ. 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో 140 మాక్స్‌ సొసైటీలు, 135 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి గతంలో చేసిన కొనుగోళ్లు, చెల్లించిన బిల్లులు, వాటి విద్యుత్తు వాడకం పరిశీలిస్తే.. సుమారు 30 శాతం బోగస్‌ సొసైటీలే ఉన్నట్టు ఇటీవలే ప్రభుత్వం చేసిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.