2024 ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈనెల 30న చలో హైదరాబాద్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్లేందుకు ముందస్తుగా ఆశా వర్కర్లు మండల వైద్యాధికారులకు వినతి పత్రంను అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు 15 రోజులు సమ్మె చేపడితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, కవిత, శకుంతల, మమత, పుష్పమ్మ, లక్ష్మి, ధనలక్ష్మి, కమల, వరలక్ష్మి, ధనమ్మ, పద్మ, ఎన్ లక్ష్మి, జి వసంత, డి మల్లేశ్వరి, బి అలివేలు, ఎస్ సుజాత, వి నిర్మల తదితరులు ఉన్నారు.