– ఉద్యమ కారుల ఫోరం మండలం అధ్యక్షులు అయిలేని సంజివరెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో అమరులైన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ఉద్యమ కారుల ఫోరం మండలం అధ్యక్షులు అయిలేని సంజివరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హుస్నాబాద్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిదశ, మలిదశ సాధన పోరాటం లో వందలాది మంది ఉద్యమకారులు బలిదానాలు చేసుకున్నారని అన్నారు. నీల్లు,నిధులు, నియామకాలే ఎజెండాగా పోరాడుతూ తొలిదశలో పోలీసుల తూటాలకు బలి అయితే,మలిదశలో స్వీయ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గాన్ని సుగమం చేశారన్నారు.తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న సంబరాలు కొద్ది రోజులలోనే ఆవిరై, కళలు కల్లలుగా మిగిలాయని అన్నారు. గత కెసిఆర్ పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారుల జీవితాల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదన్నారు. వందలాది మంది అమరుల కుటుంబాలను కూడా గుర్తించ నిరాకరించి అవమానించిన పరిస్థితిని మనం చూసామని తెలిపారు.గత ఆరు సంవత్సరాలకు పైగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోరాడుతూనే ఉందిని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఇచ్చిన మాటను వెంటనే అక్షరాలా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహ్మద్, అంకుశావలి, వలవోజు జగదీశ్వరా చారి,ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.