‘క’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేకపోతున్నాం’ అని అంటున్నారు దర్శక ద్వయం సుజీత్, సందీప్.
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. రీసెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దీపావళి విజేతగా నిలిచింది. థ్రిల్లర్ సినిమాల్లో ఓ సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఈ సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దర్శక ద్వయం సుజీత్, సందీప్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఈ దీపావళిని ఎంతో స్పెషల్ చేశారు : సుజీత్
‘పరిశ్రమలో విజయం సాధిస్తేనే మనుగడ అనుకున్నాం. అందుకే పట్టుదలగా సినిమా చేశాం. థియేటర్స్‌లో ప్రేక్షకులు సినిమా చూస్తూ చివరలో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. మేము ఈ కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ ఈరోజు ప్రేక్షకులు కథకు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు మేము ఆశించిన ఫలితాన్ని ఇచ్చారు. ఈ దీపావళిని ఎంతో స్పెషల్ చేశారు. మా కుటుంబ సభ్యుల సంతోషానికి హద్దు లేదు. హీరో కిరణ్ మమ్మల్ని సోదరుల్లా చూశారు. ఇకపై మేం చేసే సినిమాలను స్ట్రాంగ్ కంటెంట్‌తో, యూనిక్ స్టోరీస్‌తో, ఇంటర్నేషనల్ రేంజ్ ఐడియాస్‌తో చేస్తాం. ఈ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంది. కష్ణగిరి ఊరు నేపథ్యం ఏంటి?, ఆ ఊరిలోని ప్రత్యేకతలకు కారణాలు ఏంటి అనే అంశాలు ప్రీక్వెల్‌లో చూస్తారు’.
‘క’కి ప్రీక్వెల్ చేస్తాం : సందీప్
‘మా సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన విజయం ఎంతో సంతప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా మా సినిమా గురించి నెగిటివ్‌గా వస్తే ప్రేక్షకులే వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఒకప్పుడు థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ చూశాం. ఇప్పుడు మా సినిమాకు అలా హౌస్‌ఫుల్స్ కావడం గ్రేట్ ఫీల్ ఇస్తోంది. ఏపీ, తెలంగాణ అంతటా థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హీరో కిరణ్ వల్లే ఇంత ఘన విజయం మాకు సాధ్యమైంది. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మా ప్రాజెక్ట్‌లోకి వచ్చినప్పుడే మాకు ఎంతో నమ్మకం కలిగింది. మన సినిమా సేఫ్ హ్యాండ్స్‌లోకి వెళ్లిందని అనుకున్నాం. బడ్జెట్ కాదు సబ్జెక్ట్ బాగుంటే ఇంటర్నేషనల్ లెవెల్‌కు సినిమాలు తీసుకెళ్లవచ్చని డైరెక్టర్ రాజమౌళి చెప్పినట్లు మా రాబోయే సినిమాలను సరికొత్తగా రూపొందించే ప్రయత్నం చేస్తాం’.