ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు

The audience is doing wellచేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ధూం ధాం’. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మించారు. దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, సకుటుంబం గా ప్రేక్షకుల్ని ఎంటర్‌ టైన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్‌ గురించి ప్రొడ్యూసర్‌ రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేటర్స్‌ లోకి వెళ్లిన వాళ్లంతా ఎంటర్‌ టైన్‌ అవుతున్నారు. కలెక్షన్స్‌ బాగున్నాయి. ఈ సినిమాతో చేతన్‌ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మా సంస్థలో మరొక మూవీని మరికొద్ది రోజుల్లో అనౌన్స్‌ చేస్తాం’ అని చెప్పారు. రైటర్‌ గోపీ మోహన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఫస్టాఫ్‌ లో మంచి పాటలు, సెకండాఫ్‌ లో కామెడీ ఉండాలని ప్లాన్‌ చేశాం. మేము అనుకున్నట్లే సాంగ్స్‌ కు , కామెడీని ఆడియెన్స్‌ బాగా ఎంజారు చేస్తున్నారు. ఫస్ట్‌ మూడు రోజులు యూత్‌ ఎక్కువగా మూవీస్‌ చూస్తుంటారు. ఈరోజు నుంచి ఫ్యామిలీస్‌ మా మూవీకి బాగా వస్తారని ఆశిస్తున్నాం. కొడుకుని ప్రేమించే తండ్రి, తండ్రిని బాగా గౌరవించే కొడుకు కథ ఇది. నా నెక్ట్స్‌ మూవీ గల్లా జయదేవ్‌ రెండో అబ్బాయితో ప్లాన్‌ చేస్తున్నా. నా డైరెక్షన్‌ లోనే ఆ సినిమా చేస్తాను’ అని అన్నారు.