శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియస్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2′. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించి, హిలేరియస్ బ్లాక్ బస్టర్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్, మహేష్ బాబు హాజరయ్యారు. హీరో శ్రీసింహ మాట్లాడుతూ,’ప్రేక్షకులు సినిమాని చూసి హార్ట్‌ఫుల్‌గా నవ్వుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. ‘మా నిర్మాత చెర్రి, మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా చేసిన సింహకి, సత్యకి థ్యాంక్స్’ అని డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు. యాక్టర్ సత్య మాట్లాడుతూ,’సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పేరుతో పాటు సక్సెస్ వచ్చింది. అందరూ చాలా బాగా చేశానని అభినందిస్తున్నారు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘ఈ సక్సెస్‌కి కారణమైన యూనిట్ అందరికీ కూడా థ్యాంక్స్. ఈ సినిమా బాగుందని మెసేజ్ పెట్టడంతో పాటు టికెట్లు దొరకట్లేదని మెసేజెస్ రావడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లోను, సింగిల్స్ స్క్రీన్స్‌లోనూ సినిమా అద్భుతంగా ఆడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజారు చేస్తున్నారు. ప్రేక్షకుల నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రితీష్ రానా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకి ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. అలాంటి క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్ దొరకడం చాలా రేర్. కాలభైరవ తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేశాడు. ఒక విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమాని తీశాడు డీవోపీ. ఆర్ట్ డైరెక్టర్ కూడా బ్యూటిఫుల్‌గా వర్క్ చేశారు. సత్య, సింహా కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది’ అని నిర్మాత చెర్రీ చెప్పారు.