ప్రేక్షకుల స్పందన అత్యద్భుతం

The audience response was amazingఎమ్‌ఎన్‌వి సాగర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమాకి హిట్‌ టాక్‌ రావడంతో ఈ చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎం.ఎన్‌.వి సాగర్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్‌ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్‌ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రంలో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యంగా కిరాక్‌ కిరణ్‌ పాత్ర క్లైమాక్‌లో బాగా పండింది. ఈ సినిమాలో చేసిన ముగ్గురు హీరోయిన్స్‌కి స్పెషల్‌ థ్యాంక్స్‌. హన్విక తనకి ఇచ్చిన పాత్రలో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి, బేబీ సినిమాలో వైష్ణవి ఛైతన్యలాగా, ఆర్‌ఎక్స్‌100లో పాయల్‌ రాజ్‌పుత్‌లా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘నేను ఈ చిత్రంలో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని దర్శకుడు చాలా బాగా రాసారు. సాగర్‌ ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మా సినిమా మరోమారు నిరూపించింది’ అని హన్విక శ్రీనివాస్‌ చెప్పారు. ఇందులో నేను చేసిన పాత్రకు చాలా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా విజయం కెరీర్‌ విషయంల మా అందరికీ ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని మరో నాయిక ఉమా చెప్పారు.