చెరువులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉంది

-కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్
నవతెలంగాణ –  కేపీహెచ్ బీ
అన్యాక్రాంతమవుతున్న చెరువులను కాపాడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. శుక్రవారం బాలాజినగర్ డివిజన్ లోని మైసమ్మ చెరువును ఆయనతో పాటు మండల రెవెన్యూ అధికారి స్వామి, నీటిపారుదల శాఖ అధికారి లక్ష్మినారాయణ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, సిటీ ప్లానర్ మల్లేశంలు సందర్శించి, పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూకట్ పల్లి నియోజకవర్గంలోని చెరువులు కబ్జాకు గురై అన్యాక్రాంత మవుతున్నాయని, బఫర్ జోన్, ఎఫ్ టిఎల్ లలో, నాలాలను కబ్జా చేసి, స్థిర నివాసాలు ఏర్పర్చడం వల్ల భూగర్భ జలాలు అవిరావుతున్నాయన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, బౌండరీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కబ్జాల్లో  ఉన్న, ఎలాంటి వారినైనా నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు,  బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజపుత్, మాజీ కార్పొరేటర్ సయ్యద్ బాబు, మాజీ కాన్సిలర్ లక్ష్మయ్య, తూము సంతోష్, చున్ను పాషా, నయీమ్ మొహ్మద్, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.