నవతెలంగాణ – మల్హర్ రావు
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య కోరారు. ఆదివారం పెద్దతూండ్ల ఉరచేరువు ఉధృతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కురుస్తున్న వర్షంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు వెళ్లవద్దన్నారు. ముఖ్యంగా తాడిచెర్ల,మల్లారం,పివినగర్,కుంభంపల్లి,వళ్లెంకుంట,కొండంపేట తదితర మానేరు పరివాహక ప్రాంతాల్లో పశువుల కాపర్లు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కోరారు.ప్రమాదకరమైన పాత ఇండ్లలో ప్రజలు ఉండకూడదని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంటా కాంగ్రెస్ నాయకులు మహేష్,శ్రీనివాస్ పాల్గొన్నారు.