– జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లా అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తేజుస్ నంద్ లాల్ పవర్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ, క్లినికల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, బయోమెట్రిక్ అటెండన్స్ విదిగా సిబ్బంది అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి రోజు సిబ్బంది అందరూ బయోమెట్రిక్ నందు ఫేస్ రికగ్నేషన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి అని, కార్యాలయంలో సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు పరిష్కరించాలని అన్నారు. రక్షాబంధన్ సందర్బంగా అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాణి లో భూ సమస్యలు పై 5, డిఎంహెచ్వో -1, డి ఏ ఓ -2, ఆర్ &బి-01,ఇతర శాఖలు 4 మొత్తం 13 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరిటెండెంట్స్ పద్మారావు, శ్రీలత కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులు జడ్పీ సీఈఓ అప్పారావు, స్త్రీ,శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రేడ్డి,డిసిఒ పద్మ , సిపిఒ శంకర్ తదితరులు పాల్గొన్నారు.