అరగంట వ్యవదిలోనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలి

The baby should be breastfed within half an hourనవతెలంగాణ – పెద్దవూర
తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని  పుట్టిన అరగంట వ్యవది లోనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలని అనుముల ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. సోమవారం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా మండలం లోని చలకుర్తి 01 అంగన్వాడీ కేంద్రం లో  తల్లి పాల వారోత్సవాల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.బిడ్డ శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు దోహదపడతాయని  అన్నారు. ప్రసవం జరిగిన జరిగిన అరగంట వ్యవధిలోనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు. ముర్రుపాలు బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఆరునెలల వరకు తల్లిపాలనే ఆహారంగా ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ యాదమ్మ  ఆశావర్కర్, ఏఎన్ఎం,ఆయా,గర్భినులు, బాలింతలు పాల్గొన్నారు.