అశ్వారావుపేట కాంప్లెక్సు పాఠశాలల్లో బాల మేళా ప్రారంభం…

– బాల మేళా తో విద్యార్ధుల సామర్ధ్యాలు అంచనా – ఎం.ఈ.ఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : అక్షరాస్యత,సంఖ్యాశాస్త్ర పునాది కార్యక్రమంతో విద్యార్ధులు అభ్యసించిన అంశాలను ప్రదర్శించేందుకు అంచనా వేసేందుకు బాల మేళా చక్కని వేదిక అని ఎం.ఈ.ఓ ప్రసాదరావు అన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వినూత్న కార్యక్రమం లో బాల మేళా లో విద్యార్ధులు సామర్ధ్యాలను ఏ మేరకు సాధించగలిగారు అనేది అంచనా వేయవచ్చని,గణితం భాషా సామర్ధ్యాలను ఇక్కడ సామూహికంగా ప్రదర్శిస్తారు అని,విద్యార్ధులకు ఇది ఆట విడుపు గానే గాక వారి ప్రతిభాప్రదర్శనకు కేంద్రంగా ఉంటుంది అని అన్నారు.
అశ్వారావుపేట కాంప్లెక్ష్ పరిధిలోని పాఠశాలల్లో  నిర్వహిస్తున్న బాల మేళా – 2025 మంగళవారం నుండి  ప్రారంభం అయ్యాయి.
స్థానిక ప్రాధమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పి.ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం నుండి 11 వ తేదీ వరకు కాంప్లెక్సు లోని వివిధ ప్రాధమిక పాఠశాలల్లో  ఈ బాల్ మేళా నిర్వహించ నున్నామని తెలిపారు.ప్రతిభకనబర్చిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు.పాఠశాల స్థాయిలో ఎంపికైన విద్యార్ధులతో కాంప్లక్సు స్థాయి బాల్ మేళా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, కార్యదర్శి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీలావతి,సహోపాధ్యాయురాలు శారద విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.