బ్యాంకు మేనేజర్ ను సన్మానించిన పాలకవర్గం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో బస్వాపూర్ గ్రామ కోఆపరేటివ్ బ్యాంకు నుండి బదిలీ పై పెద్దమల్లారెడ్డి కోపరేటివ్ బ్యాంకు మేనేజర్ గా వచ్చిన రాజిరెడ్డిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ  కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్  రాజా గౌడ్, ఉపాధ్యక్షులు విట్టల్, పాలకవర్గ సభ్యులు బాగా రెడ్డి, కిష్టయ్య, బాబు, మైపాల్, రాములు, బాగయ్య, సొసైటీ సీఈఓ మోహన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.