రహదారిపై పెట్టిన బ్యారికేడ్లను వెంటనే తొలగించాలి

– డీసీఎంఎస్‌ చైర్మెన్‌ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ ఫారెస్ట్‌ ఆఫీస్‌ రోడ్డుకు ఇరువైపులా రహదారిపై పెట్టిన బ్యారికేడ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మెన్‌ కొత్వాల శ్రీనివాసరావు అధికారులను కోరారు. ఈ మేరకు కొత్వాల తోపాటు కాంగ్రెస్‌ నాయకులు శనివారం మునిసిపల్‌ కమీషనర్‌ ఏ.స్వామిని, ఫారెస్ట్‌ ఎఫ్‌డీఓ దామోదర్‌ రెడ్డిని కలిసి బ్యారికేడ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఆ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారని, రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారన్నారు.
కొత్వాల చొరవతో సమసిన రహదారి వివాదం
రహదారి సౌకర్యాన్ని పునరుద్దరించాలనే చొరవతో, మున్సిపల్‌, అటవీ శాఖాధికారులతో సమన్వయంగా చర్చించి, రాకపోకలను పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో వివాదం ముగిసింది. కొత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు కోండం వెంకన్న, ఎల్‌డి ఎం కో-ఆర్డినేటర్‌ బద్ది కిషోర్‌, శిరసాని రమణ, చాంద్‌ పాషా, మధు, నజీర్‌, మస్తాన్‌, బాబునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.