– జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
పార్లమెంట్ లో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు.దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రాజ్యసభ సభ్యుడు,జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను సమ్మయ్య మంగళవారం సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతదేశంలో బీసీలు శాతం 56% ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ 50% రిజర్వేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్థానిక సంస్థలు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.భారతదేశంలో బీసీ కుల గణన.కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆది మల్లేష్, సాయ్యన్న.తాయప్ప, నరేష్, అనిల్ పాల్గొన్నారు.