తెలుగు చిత్రసీమలో విశిష్ట మైన నందమూరి వార సత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ ఎన్టీఆర్ ముని మనవడు, హరికష్ణ మనవడు, దివంగత జానకీ రామ్ తనయుడు నంద మూరి తారక రామారావు హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని న్యూ టాలెంట్ రోర్స్ ఏ బ్యానర్‌పై యల మంచిలి గీత నిర్మించనున్నారు. బుధవారం నందమూరి తారక రామారావు గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు. ఈ వీడియో వైవిఎస్ చౌదరి క్రియేటీవ్ విజన్, యంగ్ హీరోకి తనపై ఉన్న కాన్ఫిడెన్స్‌ని ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రంలో కూచిపూడి నత్యకారిణి, తెలుగు నటి వీణా రావు కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ దర్శన్ ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, ‘నేను రాసుకున్న కథని మోయగలిగి, ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే దమ్మున్న క్యారెక్టర్‌ని పోషించగల సత్తా ఉన్న ప్రధాన సూత్రధారి అయిన హీరోని ఈ వేడుక ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘నందమూరి వంశంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ పిక్చర్‌తో నిర్మాత, దర్శకుడు, కొత్తగా పరిచయం అవుతున్న హీరో అఖండ విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చెప్పారు. నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ, ‘మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు’ అని అన్నారు.