నవ శకానికి నాంది పలికన నాయకులకు నవ ధాన్యాలతో ఆత్మీయ అభిమానం

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతు దినోత్సవం సందర్భంగా రైతు పండించిన ధాన్యం తో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్ర పటాలు రూపొందించారు. రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు రైతు దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది, అదేవిధంగా మంత్రి హరీష్ రావు జన్మదినోత్సం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.