బీఎస్పీ తోనే మంథని నియోజకవర్గంలో మార్పుకు నాంది.

–  నామినేషన్ వేసిన బిఎస్పీ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా
నవ తెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గ మార్పు  బీఎస్పీ తోనే సాధ్యమని బీఎస్పీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా నారాయణరెడ్డి అన్నారు.గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫామ్ అందజేసి నామినేషన్ దాఖలాలు చేశారు. ముందుగా మంథని పెట్రోల్ పంపు సెంటర్ నుండి డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చి అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడారు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బహుజనుల ఐక్యతను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేలన్నారు. మంథని నియోజకవర్గంలో బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చి, దొంగల రాజ్యాన్ని ప్రళదోలుదాలన్నారు. హత్యలు చేసే నాయకులను, అభివృద్ధికీ ఆమడదూరంలో ఉన్న నాయకులను మంథని నియోజకవర్గం నుండి తరిమి కొట్టి తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్దియించారు.