అట్టహాసంగా సంక్షేమ పథకాల ప్రారంభం ..

Initiation of Attahasanga welfare schemes..– అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
గణతంత్ర దినోత్సవం వేళ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామపంచాయతీలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి దేవరాజ్ లు, స్థానిక అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లు 121 మందికి, కొత్త రేషన్ కార్డులు 27 మందికి, రైతు భరోసా 125 మందికి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఐదుగురికి,  ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. కాగా రేషన్ కార్డులో లిస్టులో మంకిడి అఖిల్ కుమార్ కు వచ్చింది, కానీ రేషన్ కార్డు మాత్రం ఇవ్వలేదు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సరిచేసి రేపు అందిస్తామని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ తాసిల్దార్ జే సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, ఎం పి ఓ జాల శ్రీధర్ రావు, ఏపీవో (ఈజీఎస్) అనిల్, ఎం ఈ ఓ రేగ కేశవరావు, ఎం.ఆర్.ఐ డేగల సాంబయ్య, రాజు,  పంచాయతీ కార్యదర్శి ఈసం శారద, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, అంకంపల్లి గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.