నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సీపీఐ(ఎం) గ్రామ శాఖల ఆధ్వర్యంలో హనుమాపురం, వడపర్తి గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సభలను నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అన్నారు. గ్రామంలో అనేకమంది నిరుపేదలు ఇల్లు, ఇళ్ల స్థలాలు లేక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం తో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు నాలుగు కుటుంబాలు కాపురాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గ్రామసభలు నిర్వహించడం కూడ కమిటీలు వేసి గ్రామంలో ఇల్లు లేని వారిని గుర్తించి వారిలో నిరుపేదలైన వారికి మొదటి ప్రాధాన్యతగా ఇల్లు ఇవ్వడానికి గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఇవ్వాలని ఆందోళన చేయడం జరిగిందని తెలిపారు. కమిటీలలో అన్ని రాజకీయ పక్షాలను చేర్చి అవకాశం మొదటి విడతగా నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాపురం సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి మోటేఎల్లయ్య, వడపర్తి సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి పాండాల మైసయ్య ,బండి శీను, తోటకూరి నాగరాజు, నల్ల మల్లేష్ ,ఎండి గోరేమియా, సత్తయ్య, మల్లయ్య లు పాల్గొన్నారు.