– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకట రెడ్డి సూచన
నవతెలంగాణ – బెజ్జంకి
ఈ నెల 11న ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభల ద్వార ఎంపిక చేయాలని మంగళవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకట రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం అర్హులైన వారందరికి డబుల్ ఇండ్ల నిర్మించి ఇస్తామని ప్రగడ్భాలు పలికి మోసం చేసిందని ఈ ప్రభుత్వమైన అర్హులకు న్యాయం జరిగేల మార్గదర్శకాలు రూపొందించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని వెంకట రెడ్డి తెలిపారు. బేగంపేట గ్రామంలో డబుల్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన స్థలంపై నీలినీడలు కమ్ముకున్నాయని గ్రామ సభ ద్వార అర్హులను ఎంపిక చేసి స్థలం పంపిణీ చేయాలని ప్రభుత్వానికి,స్థానిక ఎమ్మెల్యేకు అయన విజ్ఞప్తి చేశారు.