– కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీలో ఎమ్మెల్యే
నవతెలంగాణ – భీంగల్
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని మాజి మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భీంగల్ మండల కేంద్రంలోని బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన మండలానికి చెందిన 136 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మొన్నటి ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లకు లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తోంది తులం బంగారం ను మాత్రం అందించలేకపోతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు పేదింటి ఆడబిడ్డ పెళ్లి కి కష్టం కాకూడదు అని కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాన్ని ప్రారంభించి గత పది ఏండ్లుగా పెళ్ళైన ఆడబిడ్డకు ఆర్థిక సహాయం చేసారని గుర్తుకు చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ చెక్ ల లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు డిప్యూటీ తాసిల్దార్ మధు , ఆర్ఐ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
పట్టణ కేంద్రానికి చెందిన శెవ్వ స్వప్న ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం మృతురాలి కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఎమ్మెల్యే వెంట మండల బి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.