నవతెలంగాణ – మోపాల్
నిజామాబాద్ జిల్లాలోని ఉత్తమ పాఠశాలగా బోర్గo (పి) జిల్లా పరిషత్ పాఠశాల నిలిచింది. ఈ పాఠశాల మరో ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రంలోను ఐదవ స్థానంలో ఉంది. ఈ పాఠశాలలో చదువుకోవడం కోసం పోటీ తత్వం ఉంటుందంటే అర్థం చేసుకోవాలి ఈ పాఠశాలలో చదువుతోపాటు క్రమశిక్షణ మరియు ఆటపాటలతో విద్యార్థినీ విద్యార్థులు ముందు ఉంటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బూర్గం జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు సరైన విద్యాబోధన ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా నాణ్యతతో ఉంటుంది. ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ పాఠశాలలకు సమీపంలో అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నా కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ధనవంతుల పిల్లల్ని కూడా ఈ పాఠశాలలో చదివిస్తున్నారు అంటే ఈ పాఠశాల ఎంత ప్రత్యేకతమో అర్థం చేసుకోవాలి. ఈ పాఠశాలలో మొత్తం బాల బాలికలు కలిపి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు 941 విద్యార్థిని విద్యార్థులు కలరు. మొన్న విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో దాదాపు 90% ఉత్తీర్ణత సాధించారు. అలాగే 10/10 ఒకరికి, 9.8 ముగ్గురికి, అలాగే 9.5 ముగ్గురు విద్యార్థులకు రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో చాలా ప్రభుత్వ స్కూలు మూతపడుతుంటే ఈ స్కూలు మాత్రమే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు రావడం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు.
