
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు రావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీవీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మన ప్రాంత వాసు బిడ్డను గౌరవించి భారతరత్న ఇచ్చినందుకు ఈ ప్రాంత బిడ్డలుగా మనం ఎంతో సంతోష పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, పిసిసి సభ్యులు లింగమూర్తి చైర్మన్ బొలిశెట్టి శివయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.