నవతెలంగాణ – హైదరాబాద్
సామ్‌సంగ్ బ్రాండ్ ఇటీవల ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్ 24 సీరిస్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన ట్లు ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్ ‘సి’ వెల్లడించింది. బుధవారం మాదాపూర్‌లో ని బిగ్ సి స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను సంస్థ ఆ సిఎండి యం బాలు చౌదరీ, డైరెక్టర్లు, సినీతారా మృణాల్ ఠాకూర్, సామ్‌సంగ్ ప్రతిని ధులు విడుదల చేశారు. ఈ సందర్బం గా బాలు చౌదరీ మాట్లాడుతూ.. గెలాక్సీ ఎస్24 అల్ట్రా, ఎస్24 ప్లస్‌లు అత్యంత అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో నెంబర్ వన్‌గా పేరొందిన బిగ్‌సి లో కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నా య న్నారు. ఈ కొత్త ఫోన్లను ఆవిష్క రించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నటీ మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.