– కమ్యూనిస్టుల ఓట్లు లేవన్న రాజగోపాల్ రెడ్డి ఎర్ర జెండా మెడలో వేసుకుని ఎలా తిరుగుతున్నాడు..
నవతెలంగాణ- మునుగోడు: కమ్యూనిస్టులకు ఓట్లు లేవు గెలవరని అన్న రాజగోపాలరెడ్డి ఎర్ర జెండా మెడలో వేసుకుని తిరగడం సిగ్గుమాలిన చర్య అని సీపీఐ(ఎం) మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు అన్నారు . సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులను అవమానపరిచే విధంగా మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో సీపీఐ(ఎం) ఆఫీస్ కి వెళ్లి ఓట్లు వేయమని అడగడం ఏమిటని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించాలని, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ప్రజల వెన్నంటి ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని అన్నారు .మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం బీఆర్ఎస్ తో జతకట్టామనివారు అన్నారు. రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్టులేననివారు అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి కై త్రాగునీటి కై పోరాడి సాధించింది కమ్యూనిస్టులేనని అన్నారు. కమ్యూనిస్టులు పోరాటం వలనే గ్రామాలలో ఇండ్ల స్థలాలు దక్కాయని అట్టి స్థలాలను చిన్నాభిన్నం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సీనియర్ కార్యకర్తలు , గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు .