మతోన్మాద బీజేపీని ఓడించాలి

మతోన్మాద బీజేపీని ఓడించాలి– ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు
నవతెలంగాణ-నిర్మల్‌
ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం మతోన్మాద బీజేపీని ఓడించి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు అన్నారు. ఆదివారం సీపీఐ(ఎం) నిర్మల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హీరా ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాటా ్లడారు. 10 ఏండ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్‌, మతోన్మాద విధానాలు బలపడ్డాయని, వాటికి వ్యతిరేకంగా దేశంలో పోరాడింది వామపక్షాలేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గుజరా త్‌లో 15 శాతం పైగా పేదరికం పెరిగగా, కేరళలో 0.7శాతం లోపలే ఉందని వెల్లడించారు. ఈ కేరళ మోడల్‌ నేడు దేశానికి అవసరం అని అన్నారు. శ్రమజీవులైన వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కార్మికులు, కౌలు రైతులకు మేలు జరగాలంటే తిరిగి వామపక్ష అభ్యర్థులను గెలిపిం చుకోవడం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. పార్లమెంట్‌లో వామపక్ష పార్టీలు లేకపోవడంతో.. రైతుల నల్లచట్టాలు, నూతన జాతీయ విద్యావి ధానం, లేబర్‌ కోడ్లు, సీఏఏ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అరన్నారు. యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు భాగస్వామ్యమయినప్పుడు పార్లమెంట్‌లో ప్రజా అనుకూల చట్టాలు చేయించి, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పని చేశాయని తెలిపారు. అందుకే దేశ ప్రయోజనాల కోసం ఇండియా కూటమి అభ్యర్థులను పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌ కుమార్‌, బొమ్మెన సురేష్‌, సుజాత, జిల్లా కమిటీ సభ్యులు డాకూర్‌ తిరుపతి, తొడసం శంభు, ఇప్ప లక్షణ్‌, నిర్మల్‌ పట్టణ కార్యదర్శి ఫసియుద్దిన్‌, నాయకులు నాగెల్లి నర్సయ్య, పోశెట్టి, వెస్లీ, నవీన్‌, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.