కంటైనర్ ను ఢీ కొన్న బైక్.. ఒకరి పరిస్థితి విషమం

– మరొకరికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని మేవాథ్ దాబా దగ్గర కంటైనర్ ను బైక్ ఢీకొనడంతో బైక్ మీద ఉన్న ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరొకరికి స్వల్ప గాయాలైన అని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి బుధవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 0400 గంటలకు పడకల్ తండా కు చెందిన కోలాబాపు సింగ్,  అతని కూతురు ఇద్దరు కలిసి ఆర్మూర్ నుండి బైక్ పై వస్తుండగా జాతీయ రహదారి 44 మీద, జక్రంపల్లి మేవత్ దాబా దగ్గర అకస్మాత్తుగా బ్రేక్ వేసి, నిర్లక్ష్యంగా దాబాలోకి వెళుతున్న కంటైనర్ కు ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి.  వారిద్దరినీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.