నవతెలంగాణ – డిచ్ పల్లి
గత పదేళ్ళలో కేంద్రంలో పరిపాలన సాగించిన బీజేపీ మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు దులుపుకుందని ఎన్ ఎస్ యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్,తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు బానోత్ సాగర్ నాయక్ అన్నారు. ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ స్వామి ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు బానోత్ సాగర్ నాయక్,నిజామాబాద్ అధ్యక్షులు వరదబట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ లోని కేంద్రీయ గ్రంథాలయం వద్ద మొహబ్బత్ కి దుకాణ్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యువ న్యాయ గ్యారంటీలను విద్యార్థులకు వివరించిపలువురిని రిజిస్ట్రార్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ళలో కేంద్రంలో పరిపాలన సాగించిన బీజేపీ మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్యోగలు కల్పిస్తామని ఆశ చూపి నిండా ముంచిందని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు దులుపుకున్నారని, కనీసం ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి వాటి ద్వారా అయినా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ బడా బాబులకు దేశాన్ని దోచిపెట్టె ఉద్దేశంతో కేవలం అంబానీ, ఆదాని లాంటి కంపెనీలకే అన్ని రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వ సంస్థలను వారికి ధారా దత్తం చేసి ప్రైవేట్ రంగాలను కూడా కుదేలు చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లేక దేశంలో నిరుద్యోగిత రేటు తారస్థాయికి చేరుతుందని పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో నిరుద్యోగులకు ఆకలి కేకలు తప్పవని సూచించారు. చదువుకునే యువత, చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ మిత్రులు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కంకణం కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.గత పదేళ్లుగా మోడీ దేశానికి చేసిందేమీ లేదని, కేవలం ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి యువతను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుతు న్నారని అన్నారు. యువతలో విద్వేషం నింపి వారిని ఇతర మతాల పైకి ఉసిగొల్పడం కాదని బిజెపికి నిజంగా దేశ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఐఐటీలు, ఐఐఎం లు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల తోపాటు పరిశోధన సంస్థలు తెరవాలని వాటి ద్వారా మాత్రమే యువతకు విద్యా ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంతేకానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి యువత భవిష్యత్తును నశనం చేయవద్దని సూచించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యువత, నిరుద్యోగులు మద్దతు తెలపాలని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు యువ న్యాయ గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు యువ న్యాయ గ్యారంటీల ప్లకార్డులను విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ రూరల్ అధ్యక్షులు ఆశిష్, ఉపాధ్యక్షులు రమణ, ఆర్మూర్ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు శశి,అఖిల్, ఆదిత్య, దినకర్,ప్రణీత్, శ్రీరామ్, సాయి సాయికుమార్, యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ కమిటీ సభ్యులు సందీప్, శ్రీను రాథోడ్,నవీన్ ,చందర్, మోహన్
తదితరులు పాల్గొన్నారు.