
నవతెలంగాణ – మిరు దొడ్డి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తవుతున్న రైతన్న కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి అన్నారు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరములు పూర్తయిం.ది ఆయన రైతాంగ కార్మిక వర్గ ప్రజా సమస్యలను పరిష్కరించలేదు దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ. 26000 , పెన్షన్ రూ.10000 అందరికీ చెల్లించాలి. నాలుగు లేబర్ కోడ్స్,రైతు మరియు విద్యుత్ సవరణ బిల్లు 2022ను రద్దు చేయాలి. అసంఘటిత రంగ కార్మికులు రవాణా,హమాలీ కార్మికులకు వెల్పర్ బోర్డులో ఏర్పాటుచేయలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముడు విరమించాలని. రాజ్యాంగ వ్యవస్థలను కాశాయికరణ విరమించాలని అన్నారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు నాది సమ్మె అని ఈ సమ్మెలో పాల్గొనాలని, హమాలీ యజమానికి జనవరి 29 నుండి సమ్మె నోటీసులు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 1 నుండి ప్రతి గ్రామంలో ఫిబ్రవరి 16 వరకు ప్రచార, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అనంతరం హమాలి కార్మిక సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కుమ్మరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా లింగంపేట ఎల్లయ్య, 19 మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జూకంటి రాజిరెడ్డి,నర్సుగారి ఎల్లం,నీల స్వామి,చెక్క స్వామి, ఎదురు బాలరాజు, కూతురు స్వామి ధర్మారం రాజు, పార బలపొచ య్య,ర్యకం దాసు,గువ్వలేగి రాజు, కుంటకొమ్ము నర్సింలు,కుమార స్వామి,కుమ్మరి ఎల్లయ్య, కుమార్, గొడుగు స్వామి,తిమ్మ స్వామి, తదితిర కార్మికులు పాల్గొన్నారు.