నవతెలంగాణ – కంఠేశ్వర్
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని ఆధిపత్య వర్గాల ముఖ్యంగా గుజరాత్ కార్పోరేట్ గుత్తేదారులకు కాసుల వర్షం కురిపించే విధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్, సిద్దిరాములు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తగిన నిధులు సాధించడంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన 8 మంది బిజెపి ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ రాజధాని అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు చూట్టు తిరిగి అనేక వినతి పత్రాలు ఇచ్చినా కేంద్ర, ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయాలేదని, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి నేటికీ లక్షలాది మంది బహుజన శ్రామిక వర్గ ప్రజలకు చెందిన యువత ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారని యస్, సిద్దిరాములు తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోని 10 లక్షల మంది బీడీ కార్మికుల సంక్షేమానికి,ఎలాంటి నిదులు,లేవు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయికపోవడం కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు తేటతెల్లం చేసిందన్నారు. రైతాంగం, వ్యవసాయ కార్మికులకు, సంఘటిత రంగంలో పని చేస్తున్న కోట్లాదిమంది బహుజన శ్రామిక వర్గానికి, భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి కంటే కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపద దోచిపెట్టే బడ్జెట్ అని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి బోర్డుకు చైర్మన్ ను నియమించిన కేంద్ర ప్రభుత్వం బోర్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేరకపోవడం ప్రభుత్వ దివాలాకోరుతం తెలుస్తుందన్నారు. హైదరాబాద్ నుండి పూనే, ముంబైకి అదుపు రైళ్లును సాధించడంలో,కామారెడ్డి నిజామాబాద్, నిర్మల్ ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్ జిల్లాల నుండి హైదరాబాద్ కు లింక్ చేస్తూ రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సిద్దిరాములు డిమాండ్ చేశారు.