మాదిగల ఆగ్రహం తీవ్ర రూపం దల్చక ముందే బీజేపీ వర్గీకరణ చేయాలి

నవతెలంగాణ -కంటేశ్వర్

మాదిగల ఆగ్రహం తీవ్ర రూపం దాల్చకముందే బిజెపి ప్రభుత్వం వర్గీకరణ చేయాలని మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బిజెపి పార్టీకి పతనం తప్పదని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గంధమాల నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్గం (పి) చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే మందకృష్ణ మాదిగ  జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి గంధమాల నాగభూషణం మాదిగ మాట్లాడుతూ.. 29 సం ల దళిత ఉద్యమ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది దండోరా ఉద్యమం అని అన్నారు.1994 జూలై 7 న దండోరా ఉద్యమ రాకతో ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల లో ఆత్మగౌరవన్ని నింపింది అని పేర్కొన్నారు. మాదిగల లో చైతన్యం నింపే విధంగా పాదయాత్రలు, రథ యాత్ర లు,సైకిల్ యాత్ర లు ద్వారా మాదిగలను చైతన్యం చేశారని గుర్తుకు చేశారు.75 సం లు గా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల విధానం వల్ల మాదిగలు విద్య, ఉద్యోగాలు, సాంఘిక సంక్షేమ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుంది అని అన్నారు.2000-04 వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరగడం వల్ల మాదిగ, మాదిగ ఉపకులల జీవితాలలో వెలుగులు నింపింది అంతే కాకుండా విద్య, సాంఘిక సంక్షేమ రంగాలలో మాదిగలకు లబ్దిజరిగింది పేర్కొన్నారు.గుండె జబ్బుల పిల్లల కోసం జరిగిన ఉద్యమం తద్వారా ఆరోగ్యశ్రీ రావడం పేదల కుంటంబల జీవితాలలో వెలుగులు నింపింది అలాగే విగలంగుల హక్కుల కై దండోరా వేసి వారికి బాసటగా నిలిచి పింఛన్లు సాధించినది అని పేర్కొన్నారు వృద్దులు, వితంతుల పింఛన్ల సాధనకు అలుపెరగని పోరాటం చేసి వృద్దులకు తోడుగా నిలిచింది అని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం తరువాతనే ఎస్సీ రిజర్వుద్ సీట్ల లో మాదిగలను ప్రాధాన్యత పెరిగింది అని అలాగే ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి పోరాటం చేసి ఎస్సీలు, ఎస్టీ ఉద్యోగస్తులు ఇవాళ ప్రమోషన్ల పొందుతూ ఉన్నతమైన స్థాయి కి చేరుకోవడం ఎమ్మార్పీఎస్ ఉద్యమ పలితమేనని అన్నారు.
       బియ్యం కోట పెంచాలి అని ఆకలి కేకలు ఉద్యమం,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోసం జరిగిన ఉద్యమం,ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మీద జరుగుతున్న హత్యలు హత్యచరపై ప్రభుత్వం వివక్ష వ్యతిరేకంగా ఉద్యమం,ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో వారికి అండగా నిలిచిన ఉద్యమం,ఇంకా ఎన్నో అలుపెరగని పోరాటాలు,అనేక ఉద్యమాలు చేసి పలితాలు సాధించినది అని గుర్తుకు చేశారు. మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తాం అని చెప్పి 9 ఏళ్లు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగదని మండిపడ్డారు.ఇకనైనా కళ్ళు తెరచి మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చలని లేని పక్షంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో కనుమరుగుకావడం కాయం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కన్వీనర్ చేవూరి  శ్యామ్ మాదిగ,మోపల్ మండల ఇంఛార్జి మనోహర్ మాదిగ,గ్రామ అధ్యక్షులు సాయులు మాదిగ,నిజామాబాద్ టౌన్ ఇంఛార్జి యదశి రాములు మాదిగ,మహిళ నాయకులురలు యమున మాదిగ, సుధ మాదిగ,రమేష్ మాదిగ,మల్లేష్ మాదిగ ,అమర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.