– సినీనటీ ఐశ్వర్య మీనన్
నవ తెలంగాణ -హైదరాబాద్
నాణ్యత, విశ్వాసానికి బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బిబిజి) ప్రతీక అని సినీ నటి ఐశ్వర్య మీనన్ అన్నారు. నోవాటెల్ హెచ్‌ఐసిసిలో 474వ గ్రాండ్ టాలెంట్ అవార్డుల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ ఇళ్లను నిర్మించడమే కాకుండా భవిష్యత్తును నిర్మించడంలో కూడా బ్లాక్ గ్రూప్ ముందుందన్నారు. మహిళా సాధికారత పట్ల చూపిస్తన్న శ్రద్ధ అమోఘమన్నారు. వ్యాపారంతో పాటు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ఇది నిదర్శనమన్నారు. తాము ఇప్పటి వరకు 240 ప్రాజెక్టులు పూర్తి చేశామని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సిఎండి మల్లికార్జున రెడ్డి తెలిపారు.