రక్త దాన శిబిరం విజయవంతం

నవతెలంగాణ-ఖమ్మం
రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్యాలయం (వీడీఓ కాలనీ) నందు శుక్రవారం నిర్వహించిన రక్త దాన శిబిరంనకు పెద్ద ఎత్తున యువకులు 50 మంది తరలి వచ్చి రక్తం దానం చేసినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ రెడ్‌ క్రాస్‌ సంస్థ ఖమ్మం చైర్మెన్‌ డా.వి.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి సాధినేని జనార్థన్‌ ఆదేశాల అనుసరించి సంస్థ వైస్‌ చైర్మెన్‌ ఆర్‌.రవీందర్‌ రావు, కార్యదర్శి గుదిమళ్ల సూర్య ప్రకాశ రావు పర్యవేక్షణ బాధ్యత నిర్వహించారు. ఈ శిబిరంలో కొత్తా సత్యనారాయణ రెడ్డి, రిటైర్డ్‌ పోలీసు డిప్యూటి సూపరింటెండెంట్‌ నరసయ్య, అనాశి రాధాకృష్ణ, జెల్లా వెంకటేశ్వర్లు, మూలగుండ్ల శ్రీహరి, గజేంధ్రుల నాగేశ్వర్‌ రావు, తాతా రాఘవయ్య, గట్టు మోహన్‌, మల్లం ఆంజనేయులు, టి.వెంకటేశ్వర్లు, మహమ్మద్‌ గౌసు, సాయీ కుమార్‌, రహీం, గంట ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.