నల్లగొండ గడ్డపై నీలి జెండాను ఎగరవేస్తం 

 – బీసీలకు న్యాయం చేసే పార్టీ బిఎస్పి మాత్రమే
 నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్:
 మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాన్యవార్ కాన్సిరాం సిద్ధాంతాలను పునికి పుచ్చుకున్న బీఎస్పీ ఆధ్వర్యంలో నల్లగొండ గడ్డపై నీలి జెండాను ఎగురవేస్తామని బీఎస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ గా  నూతనంగా బాధ్యతలు తీసుకున్న ముదిరాజు మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు  లోకబోయిన రమణ ముదిరాజ్ పేర్కొన్నారు. బీఎస్పీ నల్లగొండ నియోజకవర్గం అధ్యక్షులు పెరిక అభిలష్  ఆధ్వర్యంలో  రమణ ముదిరాజ్ సోమవారం  బిఎస్పి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని నల్లగొండ నియోజకవర్గంలో బిఎస్పీ జెండాను ఎగరవేసి అసెంబ్లీ కి వెళ్ళటానికి బీసీ నాయకునిగా ముందుంటున్నాని తెలిపారు. వివిధ పార్టీలో ఉండి అధికార పార్టీ యంత్రాంగానికి బానిసలుగా ఉన్నటువంటి వారంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కి బహుజన్  సమాజ్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.బీసీలకు న్యాయం చేసే  ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి మాత్రమే నని  ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో నీలి జెండా ఏనుగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన ఎంపికకు  సహకరించినటువంటి జిల్లా కమిటీ సభ్యులు, అసెంబ్లీ కమిటీ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులకు,  ముదిరాజ్ సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో నలగొండ జిల్లా ఇన్చార్జీలు పంబాల అనిల్ కుమార్, ఆదిమల్ల గోవర్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్,  ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్సిరాం,  ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒంటెపాక  యాదగిరి,  మైనార్టీ నాయకులు షేక్ చాంద్ పాష,  జిల్లా ఈసీ మెంబర్ గార మారయ్య, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చింత శివరామకృష్ణ,  అంకేపాక శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి సూరారం రాంప్రసాద్,  మండల అధ్యక్షులు బొజ్జ నరసింహ, కొండా నరేందర్, లింగస్వామి, భాను ప్రసాద్, అభినవ్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.