గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ-కూకట్‌ పల్లి
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది, సెక్టార్‌ ఎస్సై కష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ,ఎల్లమ్మబండ పరిధిలోని జయనగర్‌ ఎల్లమ్మ చెరువులో ,సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహం ఒంటి మీద బ్లూ కలర్‌ షర్ట్‌ ,బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌, వైట్‌ కలర్‌ హాఫ్‌ బనియన్‌,ధరించి ఉన్నాడు. అలాగే కుడి చేతి పైన తెలుగులో బాబా శాదుల్లా అనే టాటు ఉంది.