గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండల శివారులో ఉన్న మక్తమాధారం వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కడ్తాల్‌ పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ తెల్పిన వివ రాల ప్రకారం 29-04-2024 సోమవారం రాత్రి అందాజ (45) గుర్తు తెలియని వ్యక్తిని మక్తమాధారం వెంచర్‌లో కాల్చి పడవేసినట్టు గుర్తించారు. శవం ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తే ఎక్కడో చంపేసి ఇక్కడ పడవేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మక్తమాధారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా మిస్సింగ్‌ కేసు నమోదై ఉంటే, కడ్తాల్‌ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. అందుకోసం 8333993536, 8712568298, 9493628100 నెంబర్‌లకు ఫోన్‌ చేయాలని ఆయన పేర్కొన్నారు.