– ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం బీ -మెంట్రాజ్ పల్లి వెళ్లే రహదారి పక్కన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వెంటనే పోలీసులు సమాచారం అందజేయాలని ఎస్ హెచ్ ఓ మొహమ్మద్ షరీఫ్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సుమారు 45 నుండి 50 సంవత్సరాలు కాల వ్యక్తి డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బీ నుండి మెంట్రాజ్ పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉందని,మృతిని కుడి చేతి మీద పుట్టుమచ్చ నీతా రమేష్ గవాతే-నాందేడ్- కొండిబా అని పచ్చ బొట్టు ఉందన్నారు. మృతుడు బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఫుల్ షర్టు, బ్లాక్ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాట్లు మృతుడిని ఎవరైనా, గుర్తు పట్టినచో డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ 8712659852, డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్ 8712659851 నెంబర్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోస్ట్మాస్టర్ నిమిత్తం మృతదేహానికి జిల్లా కేంద్రంలోని మార్చురీ కు తరలించారు.